టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..

Happy Birthday Nikhil: యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో.. కుమారి 21F ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా '18 pages'.

టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..
18 Pages First Look

Updated on: Jun 01, 2021 | 3:28 PM

Happy Birthday Nikhil: యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో.. కుమారి 21F ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ’18 pages’. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే జూన్ 1న నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇందులో నిఖిల్ కళ్లకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో ఏదో రాస్తున్నట్లుగా చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫోటోను హీరోయిన్ అనుపమ సైతం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ” నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. ” #18PagesFirstLook అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్వీట్…

Also Read: Karan Mehra: పాపులర్ టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్.. తనను కొట్టాడంటూ భార్య ఫిర్యాదు.. ఆ వెంటనే..

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..