టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil) రీసెంట్ గా కార్తికేయ 2తో సాలిడ్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో నిఖిల్ పాపులర్ అయ్యాడు. అంతకు ముంది సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ 2పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. చందుమొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ. కృష్ణుడి కడియం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా సక్సెస్‌తో జోరుమీదున్న నిఖిల్ తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా ఓ ఇంగీష్ మీడియాతో మాట్లాడాడు నిఖిల్. ఓ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే కథే ముఖ్యం అన్నాడు నిఖిల్.. కథ బాగుంటే తప్పకుండా విజయం లభిస్తుందన్నారు. సినిమాల్లోకి రావడానికి చాలా నేను కష్టపడ్డాను. నాకంటూ ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే ఇబ్బందులు పడేవాడిని కాదు అని అన్నారు. అలాగే ‘సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ కుటుంబం నుంచి వచ్చి నటుడిగా మారడమే నాకో పెద్ద సక్సెస్. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పొందుతున్న ఆధారాభిమానాలుచూస్తుంటే నా మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’ రోజులు గుర్తుకు వస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు నిఖిల్. హ్యాపీడేస్ సినిమా తర్వాత ఆరు సినిమాలు చేశాను ఆ సమయంలో నాకు ఎలాంటి కథలను సెలక్ట్ చేసుకోవాలో చెప్పేవారు లేరు. వరస ఫ్లాపుల తర్వాత స్వామిరారా సినిమా తో హిట్ అందుకున్నా.. అప్పుడే అర్ధమైంది కథే ముఖ్యమని అన్నారు నిఖిల్.