Karthikeya 2: ఒక్క పోస్టర్‌తోనే ఇంత బిజినెస్ జరిగిందా..? భారీ ధరకు కార్తికేయ 2 శాటిలైట్ రైట్స్..

|

Sep 04, 2021 | 6:53 PM

హ్యాపీడేస్ సినిమాతో ఫెమస్ అయిన హీరోల్లో నిఖిల్ ఒకడు. నిజానికి అందరికంటే ఈ కుర్ర హీరోకే క్రేజ్ వచ్చింది. హ్యాపీడేస్ తర్వాత వరుసగా సినిమాలు

Karthikeya 2: ఒక్క పోస్టర్‌తోనే ఇంత బిజినెస్ జరిగిందా..? భారీ ధరకు కార్తికేయ 2 శాటిలైట్ రైట్స్..
Follow us on

Karthikeya 2: హ్యాపీడేస్ సినిమాతో ఫెమస్ అయిన హీరోల్లో నిఖిల్ ఒకడు. నిజానికి అందరికంటే ఈ కుర్ర హీరోకే క్రేజ్ వచ్చింది. హ్యాపీడేస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు నిఖిల్. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక స్వామి రారా, కార్తికేయ, అర్జున్ సురవరంవంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రానున్నాడు. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చెందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు కూడా చందు మొండేటినే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్లు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించాయి.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరుగుతుందని తెలుస్తుంది. కార్తికేయ 2 సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు సొంతం చేసుకున్నారు జీ సంస్థలు. కేవలం కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. వీటితోనే సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరగడం గమనార్హం. ఈ సినిమాలో కార్తికేయ మూవీలో హీరోయిన్‌గా నటించిన కలర్స్ స్వాతి కీలకపాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాతోపాటు సుకుమార్ రైటింగ్స్‌లో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kartikeya’s Raja Vikramarka : ఎన్ఐఏ‌ ఆఫీసర్‌గా కార్తికేయ…ఆకట్టుకుంటున్న ‘రాజా విక్రమార్క’ టీజర్..

Singer Sunitha: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

Mahesh Babu: బాలీవుడ్ స్టార్‌తో కలిసి నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాడ్ షూట్ లీక్..