
నిఖిల్ సిద్దార్థ నటించిన కార్తికేయ2(Karthikeya 2) సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నిఖిల్. తన సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో.. థియేటర్లన్నింటినీ చుట్టి వస్తున్నారు. జనంలో తన సినిమాకు వస్తున్న రియాక్షను కళ్లారా చూస్తున్నారు. పట్టరాని ఆనందంతో.. ఆ వీడియోలను … థియేటర్ ముందున్న హౌస్‌ఫుల్ బోర్డులను సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ2 బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక రీసెంట్‌గా తన ఫ్యాన్స్ తో కలిసి తిరుపతిలోని PGR థియేటర్‌ను విజిట్ చేశారు నిఖిల్. బైకులపై ర్యాలీగా థియేటర్ దగ్గరకు వచ్చిన నిఖిల్ అండ్ ఫ్యాన్స్ ను టాపాసులతో ఇన్‌వైట్ చేశారు థియేటర్ యాజమాన్యం.ఇక నేరుగా థియేటర్ లోపలికి వెళ్లిన నిఖిల్ హౌస్ ఫుల్ అయిన హాలులో హంగామా చేశారు. తన సినిమా చూడ్డానికి వచ్చిన ఆడియెన్స్ను పలకరించారు. సినిమాను ఇంత భారీ హిట్ చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు.
WHATTTT A WELCOME IN TIRUPATI ????????? Entered PGR CINEMAS to find Housefull crowds ?????? thanks for all the LOVE #Karthikeya2 #Karthikeya2Hindi pic.twitter.com/VabXPV5TRr
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 19, 2022