Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో ఘనంగా భోగి వేడుకలు.. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఏం చేశారో చూశారా? వీడియో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'మన శంకరవరప్రసాద్‌గారు'. అనిల్‌ రావిపూడి తెరకెక్కంచిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో ఘనంగా భోగి వేడుకలు.. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఏం చేశారో చూశారా? వీడియో
Chiranjeevi Family

Updated on: Jan 14, 2026 | 4:21 PM

దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంతింటికి చేరుకుని మరీ ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో భాగమవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి ఈ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో రామ్‌చరణ్‌, సుస్మిత, , వరుణ్‌- లావణ్య, వైష్ణవ్‌ తేజ్‌ తదితరులు దోసెలు వేస్తూ కనిపించారు. అలాగే మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్‌ కాఫీ తాగుతూ దర్శనమిచ్చాడు. వీరితో పాటు ఉపాసన, సుస్మిత, సురేఖ, నాగబాబు తదితరులును కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన నిహారిక.. ఇది భోగిలా లేదు, దోశ రోజుగా ఉంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే.. మా కుటుంబమంతా ఒక చోట చేరి మన సాంప్రదాయాలను, పండగలను అద్భుతంగా జరుపుకుంటాం’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

కాగా ఇప్పుడే కాదు గతంలో కూడా సంక్రాంతి పండగ సమయంలో మెగా కుటుంబ సభ్యులందరూ ఇలా ఒకే చోట చేరుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సారి మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో మరింత జోష్ వచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించంది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ మొదటి రోజే రూ.84 కోట్లు రాబట్టి మెగాస్టార్ పవర్ ను మరోసారి ప్రూవ్ చేసింది. ఇక రెండు రోజులకు కలిపి ఈ మెగా మూవీకి రూ. 120 కోట్లు వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

 

చిరంజీవి ఇంట్లో భోగి వేడుకలు.. వీడియో ఇదిగో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..