
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ హిస్టారికల్ మూవీ ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం (జులై 21)న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మెగా ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీ కోసం చాలా కష్టపడుతోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఒక్కరోజులోనే ఆమె ఏకంగా15 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కో మీడియా సంస్థకూ సుమారు అరగంట పాటు టైమ్ కేటాయించిన నిధి సుమారు 8 గంటల పాటు నిరంతరాయంగా ఇంటర్వ్యూయర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. నిధి డెడికేషన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా హరి హర వీరమల్లు సినిమా సక్సెస్ కోసం గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది నిధి. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించింది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు నిధి అగర్వాల్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంతకు ముందు విజయ వాడ ఇంద్రకీలాద్రి ఆలయంలోనూ నిధి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
#TFNExclusive: Gorgeous @AgerwalNidhhi visits Yellamma Temple on the occasion of bonalu, to seek divine blessings ahead of #HHVM release!!🤍💫#NidhhiAgerwal #HariHaraVeeraMallu #TeluguFilmNagar pic.twitter.com/BGeYDLO0H1
— Telugu FilmNagar (@telugufilmnagar) July 20, 2025
Actress @AgerwalNidhhi is putting her heart and soul into promoting #HariHaraVeeraMallu, and that too single-handedly. She’s already sacrificed 5 years for this one film. She’s nothing less than a gem 💎.
Your Hardwork will Pay Off Nidhhi ❤️ pic.twitter.com/ozKNQVGXPB
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) July 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..