Nidhhi Agerwal: ఒంటరిగా అలాంటి సినిమాలు చూడలేను.. హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్..

|

Dec 06, 2024 | 9:08 PM

అందం, అభినయంతో మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రావట్లేదు. నటిగా ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోలతో కలిసి నటించి ఛాన్స్ అందుకుంది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన బ్రేక్ మాత్రం రావట్లేదు. తనే హీరోయిన్ నిధి అగర్వాల్.

Nidhhi Agerwal: ఒంటరిగా అలాంటి సినిమాలు చూడలేను.. హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్..
Nidhhi Agerwal
Follow us on

సౌత్ ఇండస్ట్రీలో యూత్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ ఆ చిత్రాలు విడుదల కావాలంటే ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఎప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉండే నిధి.. తాజాగా ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలు, సినిమా అప్డేట్స్ పంచుకుంది.

ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం ? అని ఓ నెటిజన్ అడగ్గా.. “నాకు తెలుగు మాట్లాడం వస్తుంది. కేవలం అందరికీ నమస్కారం” అంటూ రిప్లై ఇచ్చింది. తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు ? అని మరో నెటిజన్ అడగ్గా.. నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను.. 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి అని చెప్పుకొచ్చింది. తనకు జీవితంలో ప్రశాంతత ముఖ్యమని తెలిపింది.

మీకు హారర్ సినిమాలు అంటే ఇష్టమేనా ? ఒంటరిగా కూర్చొని చూస్తారా ? అని మరో నెటిజన్ అడగ్గా.. “అసలు చూడలేను. నాతోపాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. రాజ్ సాబ్ సినిమా చూడాటానికి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్ కు రండి” అంటూ రిప్లై ఇచ్చింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారర్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.