పై ఫొటోలో అల్లుకుపోయిన కొత్త జంటను గుర్తు పట్టారా? వీరికి ఇటీవలే వివాహమైంది. హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్, వివాహానరంతరం జరిగే కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. అంతుకు ముందు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను వివాహ ఆహ్వాన పత్రికలు పంచుతూ దేశమంతా చుట్టేశారు. ఇలా గత కొన్ని రోజులుగా ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లిపోయారు. అందమైన లోకేషన్లలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ కొత్త జంట ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. వీరు ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె భర్త నికోలయ్ సచ్‌దేవ్. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ ప్రేమ పక్షులు ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిషతో సహా పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో సందడి చేశారు.
ఇక ఇటీవలే చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, బాలకృష్ణతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. కొత్త జంటను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Film personalities @ #VaralaxmiSarathkumar Nicolai Marriage 🎉🎉✨️#Superstar #Rajinikanth #Arya #Prabhu #VaralaxmiSarathkumar | #NicholaiSachdev pic.twitter.com/jWJeOEpOud
— South Cine Entertainment (@SouthCineEnt) July 6, 2024
కాగా పెళ్లైన వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు వరలక్ష్మి, నికోలయ్ సచ్ దేవ్. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తమ హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర చేస్తున్నారు. ‘తుపాన్ తరువాత ప్రశాంతత’ అంటూ వరలక్ష్మి షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా థాయ్ లాండ్ లో ఏడడుగులు నడిచిన ఈ ప్రేమ జంట హనీమూన్ కు ఎక్కడ వెళ్లారో మాత్రం చెప్పడం లేదు.
வரலக்ஷ்மி சரத்குமார் – நிக்கோலாய் சச்தேவ் சங்கீத் விழாவில் திரை நட்சத்திரங்கள்! #VaralaxmiSarathkumar #NicholaiSachdev #sooriyan pic.twitter.com/XQ6TCpe198
— SooriyanFM – சூரியன்FM (@SooriyanFMlk) July 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.