Netrikann Trailer: క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌గా రానున్న ‘నెట్రికన్’.. ఆకట్టుకొంటున్న నయనతార మూవీ ట్రైలర్..

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు..

Netrikann Trailer: క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌గా రానున్న నెట్రికన్.. ఆకట్టుకొంటున్న నయనతార మూవీ ట్రైలర్..
Nayan

Updated on: Jul 30, 2021 | 12:16 PM

Netrikann: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నయన్. ఈ క్రమంలో ఆమె నటించిన నెట్రికన్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నాయనతార అంధురాలి పాత్రలో కనిపించనుంది. మిలింద్‌‌‌‌రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌‌‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. అంధురాలైన నయన్ రాష్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఆ తర్వాత  సీరియల్ కిడ్నాపర్‌‌‌తో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. అమ్మాయిలను కిడ్నప్ చేసే క్యాబ్ డ్రైవర్‌‌‌తో అంధురాలి పోరాటం ఎలా సాగింది అన్నది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సస్పెన్స్ ఎలిమెంట్స్‌‌‌కి తగ్గట్టే ఇందులో ఎగ్జయిట్ మెంట్ పెంచే సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకొంటోంది.

నయన్ ఇప్పటివరకు తన కెరీర్‌‌‌లో పోషించని వైవిధ్యమైన పాత్రను పోషిస్తోంది. అమ్మాయిలను ఎత్తుకెళ్లే  సైకో రేపిస్ట్‌‌ని పట్టుకోవటానికి అంధురాలైన నయన్ పోలీసులకు ఎలా సహకరించిందన్నది. అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. `నెట్రికన్` తమిళ్- తెలుగు మలయాళం – కన్నడ భాషల్లో 13న ఆగస్టు 2021 న డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా విడుదల కానుంది. ఈ ట్రైలర్ పై మీరు ఒక లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌‌‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ

Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు పండగే.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే

ధనుష్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. స్టోరీ లైన్ ఇదేనా..?