Rashmika Mandanna : ఎయిర్ పోర్టులో అలా దర్శనమిచ్చిన అందాల రష్మిక.. ఆడేసికుంటున్న నెటిజన్లు..

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది

Rashmika Mandanna : ఎయిర్ పోర్టులో అలా దర్శనమిచ్చిన అందాల రష్మిక.. ఆడేసికుంటున్న నెటిజన్లు..
తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది రష్మిక. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 25, 2022 | 8:14 AM

Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న(Rashmika Mandanna). వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో తెలుగులో రష్మిక కు ఆఫర్లు క్యూ కట్టాయి. ఛలో తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమా సాలిడ్ హిట్ అందుకోవడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ అందాల భామ. తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది రష్మిక. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప(Pushpa) సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇక రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా .. తమిళ్ , కన్నడ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ , పుష్ప 2 సినిమాలు చేస్తుంది. అలాగే హిందీలో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ సినిమాలు చేస్తోంది రష్మిక.

అలాగే రష్మిక సోషల్ మీడియాలోను విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి పేరుమీద వందలాది ఫ్యాన్ పేజ్ లు కూడా ఉన్నాయి. తాజాగా డ్రెస్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అమ్మడి డ్రెస్సింగ్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న రష్మిక తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే అక్కడ ఆమె డ్రెస్సింగ్ చూసి అంతా షాక్ అయిపోయారు. టీ-షర్ట్, షార్ట్ ధరించి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం అయ్యింది రష్మిక. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె వేసుకున్న టీ-షర్ట్, షార్ట్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మరీ ఓవర్ అంటూ.. ఈమెకు చలిగా లేదా అని.. కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: మన హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ బ్యూటీ.. కానీ హిందీ హీరోలను మాత్రం..

Pragya Jaiswal: సల్మాన్ తో రొమాంటిక్ సాంగ్ చేశా.. ఆయన్ని మొదట ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రగ్య

Ram Gopal Varma: అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి తోడైతే.. వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవీ.. కొండా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే