
హానీ రోజ్.. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హానీ రోజ్. తేనె కళ్లతో కుర్రకారును కట్టిపడేసిన ఈ కేరళ కుట్టి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ లేటేస్ట్ గ్లామర్ లుక్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేసింది హానీ. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. నెట్టింట అందాలతో రచ్చ చేసిన ఈబ్యూటీ ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో తెగ సందడి చేసింది. అయితే ఎప్పుడు అందాల ప్రదర్శన చేసే ఈ బ్యూటీపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ఆమె నటిస్తోన్న కొత్త సినిమానే.
ప్రస్తుతం హానీ రోజ్ రాచెల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం విడుదల చేశారు మేకర్స్. అందులో హానీ రోజ్ సీరియస్ గా చూస్తూ గ్లామర్ లుక్ లో కనిపించింది. చేతిలో కత్తి పట్టుకుని భీఫ్ మాంసం కొడుతోంది. ఇక విజువల్స్ లో ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఆమె భీఫ్ అమ్మే మహిళగా కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లోకి నెట్టిసింది.
తాజాగా విడుదలైన పోస్టర్ లో గ్లామర్ గా హానీ కనిపించినప్పటికీ నెటిజన్స్ దృష్టి మాత్రం ఆమె చుట్టూ ఉన్న భీఫ్ మాంసం పై పడింది. ఆమెతోపాటు.. ఈ సినిమాను కూడా బ్యాన్ చేయాలంటూ నెట్టింట ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అయితే ఈ కామెంట్స్ పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.