
తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
ఇక ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు కదలకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయ్యింది. రీ రిలీజ్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పై ఫోటో చూశారుగా.. మహేష్ బాబును హైదరాబాద్ పంపడానికి వెంకటేష్ రైల్వే స్టేషన్ కు వచ్చే సన్నివేశంలో కనిపించిన ఈ నటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
అయితే ఈ ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్ అని సోషల్ మీడియాలో టాక్ చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో కాదు దక్ష నాగర్కర్. ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ లాంటి సినిమాల్లో నటించింది దక్ష నాగర్కర్. ఈ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దక్ష నాగర్కర్. కానీ ఆతర్వాత వచ్చిన జంబి రెడ్డితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాంబీరెడ్డి సినిమాతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాలు స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది. అయితే సీతమ్మ వాకిట్లో కనిపించింది ఈ చిన్నదే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇంతకూ ఆమె కాదో తెలియదు కానీ కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి