Nayanthara And Vignesh Shivan: నయన్‌- విగ్నేష్ మ్యారేజ్‌ ఫుటేజ్‌‌పై క్లారిటీ ఇచ్చిన నెట్‌ఫ్లెక్స్

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా పడ్డాడు మన బుల్ బుల్‌ రాజా! అని నయన్ భర్త విఘ్నేష్ శివన్‌ను చూస్తూ పాడుతున్నారు కోలీవుడ్ నెటిజన్లు. పాడడమే కాదు..

Nayanthara And Vignesh Shivan: నయన్‌- విగ్నేష్ మ్యారేజ్‌ ఫుటేజ్‌‌పై క్లారిటీ ఇచ్చిన నెట్‌ఫ్లెక్స్
Nayanthara Vignesh Shivan

Edited By:

Updated on: Jul 22, 2022 | 8:32 PM

విఘ్నేష్ శివన్‌(Vignesh Shivan)కు నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చిందని కొద్ది రోజుల క్రితం వచ్చిన రూపర్స్‌ను మరవకముందే.. ఈ డైరెక్టర్ వల్ల నయన్‌(Nayanthara) 25కోట్లు నష్టపోయిందనే న్యూస్ బయట ఇంకా తిరుగుతుండంగానే..! మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది నెట్‌ఫ్లిక్స్. నయన్ – విఘ్నేష్ ప్రైఫోట్‌ ఫోటోలను షేర్ చేసి.. ఫ్యాన్స్కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ ఇచ్చింది. సర్‌ప్రైజ్‌ ఇవ్వడమే కాదు.. నయన్‌- నెట్‌ఫ్లిక్స్ ఢీల్ పై వస్తున్న వార్తలు అబద్దం అనేలా ట్వీట్ చేసింది. ఇక చాలా గ్రాండ్‌గా.. గ్రాండ్‌లోనూ అంతే ట్రెడీషనల్‌గా స్టార్ హీరోయిన్ నయనతారను పెళ్లి చేసుకున్నారు డైరెక్టర్ విఘ్నష్ శివన్. ముక్కింటి సాక్షిగా.. తనను ఎంతోగానో ప్రేమించే అమ్మా నాన్నాల కోరిక మేరకు మహాబలేశ్వరంలోనే నయన్ మెడలో మూడు ముళ్లు వేశారు. ఇక అక్కడి నుంచి దేవాలయాలన్నీ తిరుగుతూ.. తన మొక్కులు కూడా తీర్చుకున్నారు. తమ జంటను చల్లగా చూడమని కోరారా.

సీక్రెట్ గా చాల తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న నయన్ అండ్‌ శివన్‌! వారి మ్యారేజ్‌ ఫుటేజ్‌ను ఎక్స్‌క్లూజివ్గా నెట్‌ఫిక్స్‌కి ఇచ్చేశారనే టాక్ ఉంది. అయితే ఇటీవల ఆయన షేర్ చేసిన కొన్ని ఫోటోలతో.. ఆ ఢీల్ క్యాన్సిల్ అయ్యిందనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు ఇదంతా అబద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. త్వరలో వీరి పెళ్లి తాలూకూ.. ‘బియాండ్‌ ఫెయిరీ టేల్‌’ అనే వీడియోను రిలీజ్‌ చేస్తామంది. దాని కోసం చిన్న టీజర్లా.. నయన్ – విఘ్నేష్ బీచ్‌లో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

నయన్‌- విగ్నేష్ మ్యారేజ్‌

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి