డైరెక్టర్ గోపిచంద్ మలినేని, నందమూరి నటసింహం కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా అప్టేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బాలయ్య బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేశారు మేకర్స్. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా (జూన్ 9న) గురువారం సాయంత్రం NBK 107 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్లో బాలయ్య ఆహార్యం, డైలాగ్స్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పులిచర్ల నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిస్తోంది. ఇందులో బాలయ్య సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్నాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి అదిరిపోయింది. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు అన్నగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఒక టైటిల్ కన్ఫా్ర్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది.