ధనుష్.. నయనతార.. ఓ సినిమా..! వివాదానికి అసలు కారణం ఇదే.. పదేళ్లు వెనక్కి వెళ్తే..

కోలీవుడ్ స్టార్ ధనుష్.. లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. నయనతార కెరీర్, వివాహంపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ వేదికగా వివాదం చెలరేగుతోంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి..

ధనుష్.. నయనతార.. ఓ సినిమా..! వివాదానికి అసలు కారణం ఇదే.. పదేళ్లు వెనక్కి వెళ్తే..
Nayanthara Vs Dhanush

Edited By:

Updated on: Nov 17, 2024 | 8:51 AM

కోలీవుడ్ స్టార్ ధనుష్.. లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. నయనతార కెరీర్, వివాహంపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ వేదికగా వివాదం చెలరేగుతోంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి కాపీరైట్ అంశం కారణమైనా.. ఇద్దరి మధ్య వివాదానికి గల అసలు కారణం వేరే ఉంది. ఇద్దరి మధ్య తాజాగా జరుగుతున్న కాంట్రవర్సీ వెనుక అసలు కారణం ఏంటనేది తెలియాలంటే పదేళ్లు వెనక్కి వెళ్లాలి. తమిళ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ధనుష్ ఒకరు. కోలీవుడ్ దర్శకుడు కస్తూరి రాజా కుమారులు దర్శకుడు సెల్వ రాఘవన్, నటుడు ధనుష్. ధనుష్ నటుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఒకటైన ‘నాను రౌడీ దాన్’ అనే చిత్రానికి ధనుష్ నిర్మాత. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది దర్శకుడు విగ్నేష్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ద్వారానే విగ్నేష్, నయనతార మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి వివాహం దాకా వెళ్ళింది. తాజాగా నయనతార, కెరీర్ వివాహం వీటన్నింటిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. నెట్‌ఫ్లిక్స్‌లో మరో రెండు రోజుల్లో స్క్రీనింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార వివాహానికి సంబంధించి.. విగ్నేష్ పరిచయం.. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి