Nayanthara: విడాకుల వార్తలపై నయనతార రియాక్షన్.. ఒక్క ఫోటోతో కౌంటరిచ్చిన హీరోయిన్..

లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఈమధ్య కాలంలో వరుసగా అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన భర్తతో నయన్ విడిపోతుందని.. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ వార్తలపై ఘాటుగానే స్పందించింది నయన్.

Nayanthara: విడాకుల వార్తలపై నయనతార రియాక్షన్.. ఒక్క ఫోటోతో కౌంటరిచ్చిన హీరోయిన్..
Nayanthara

Updated on: Jul 10, 2025 | 4:37 PM

సౌత్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని పలు వెబ్ సైట్లలో వార్తలు వినిపించాయి. తమ గురించి వస్తున్న వార్తలపై తాజాగా నయనతార స్పందించింది. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. “మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే” అంటూ రూమర్స్ ను గట్టిగానే ఖండించారు నయన్.

కొన్నిరోజులుగా నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటితోపాటు నయనతార పేరుతో ఓ ఫేక్ ఇన్ స్టా స్టోరీ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ కావడంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. “తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. ” అంటూ నయన్ పేరుతో ఓ ఇన్ స్టా స్టోరీ ఫోటో చక్కర్లు కొట్టింది. దీంతో నయనతార, విఘ్నేశ్ శివన్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో త్వరలోనే ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం నడిచింది.

ఇవి కూడా చదవండి

Nayanthara, Vignesh

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే యశ్ నటిస్తోన్న టాక్సిక్ సినిమాతోపాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..