Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథనాయికలలో ఒకరు నయనతార. అందం , అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..
Nayanthara

Updated on: Nov 19, 2021 | 5:30 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథనాయికలలో ఒకరు నయనతార. అందం , అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకుంది నయన్. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ స్టోరీలను చేస్తూ లేడీ సూపర్ స్టార్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన్. ప్రస్తుతం హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్‏గా దూసుకెళ్తుతుంది. తాజాగా నయన్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలోనూ నటిస్తోంది. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో నయన్.. చిరు చెల్లెల్లి పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒరిజినల్ వెర్షన్లో మంజు వారియర్ పాత్రలో నయన్ కనిపించబోతున్నట్లుగా సమాచారం. అయితే చిరు చెల్లెలిగా నటించేందుకు లేడీ సూపర్ స్టార్ భారీగానే డిమాండ్ చేసిందట. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నయన్ ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోలేదని టాక్. ఈ సినిమాలో నయనతార పాత్ర ఎంతో కీలకంగా కనిపించనుందని.. గతంలో లేని విధంగా ఆమె పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నారట. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడట. అంతేకాకుండా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం అతిథి పాత్ర పోషిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..

Bigg Boss 5 Promo: బిగ్‍‏బాస్‏కు షాకిచ్చిన సిరి.. షణ్ముఖ్.. ప్రజలపై నమ్మకం ఉందంటూ..

Megastar Chiranjeevi: తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి చిరు విజ్ఞప్తి..