ఆ ఇద్దరు హీరోలే నాకు ఆదర్శం.. ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేసిన నవీన్ పోలిశెట్టి

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.

ఆ ఇద్దరు హీరోలే నాకు ఆదర్శం.. ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేసిన నవీన్ పోలిశెట్టి
Naveen Polishetty

Updated on: Jan 13, 2026 | 2:31 PM

అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అనగనగా ఒక రాజు ప్రీ-రిలీజ్ వేడుక వరంగల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. గతంలో జాతి రత్నాలు ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమయంలో వరంగల్ ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహం, ఎనర్జీని గుర్తుచేసుకున్నారు. ఆ మద్దతుతోనే బుక్ మై షోలో టికెట్లు వేగంగా అమ్ముడయ్యాయని అన్నారు నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ,

భీమవరం నుంచి ప్రారంభించి ఆంధ్ర, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు వెళ్ళమని చెప్పారు. సినిమా విడుదల తర్వాత అమెరికా టూర్‌కు కూడా వెళ్లనున్నట్లు తెలిపారు. తన సినిమాలకు మార్కెటింగ్ చేసేది ప్రేక్షకులేనని, తన జర్నీలో ప్రతి సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బలంగా పనిచేసిందని నవీన్ అన్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సమయంలో పది షోలు కూడా దొరకని పరిస్థితి నుంచి ప్రేక్షకుల మద్దతుతో సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యిందని అన్నారు నవీన్. ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం తనకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాలనే స్పూర్తి ని ఇచ్చాయని, ఆ తర్వాతే అనగనగా ఒక రాజు కథ రాశారు అని నవీన్ తెలిపారు.  ఈ సినిమాలో ఆకట్టుకునే వినోదంతో పాటు, రెండవ భాగంలో ఒక అందమైనఎమోషనల్ డ్రామా కూడా ఉందని నవీన్ అన్నారు.  జనవరి 14న టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లకు వచ్చి కూర్చుంటే, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా వినోదాన్ని అందించి, సంక్రాంతికి ఒక మంచి సినిమాను అందించే బాధ్యత తమదని నవీన్ పొలిశెట్టి స్పష్టం చేశారు.

నాకు కుటుంబ నేపథ్యం లేకపోయినా, నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా మంది కుటుంబాలు (అభిమానులు) ఉన్నారు అని నవీన్ అన్నారు. ఈ కుటుంబాలందరినీ తన చివరి శ్వాస వరకు అలరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. తన గురువు చిరంజీవి గారి హుక్ స్టెప్ ఈ సంక్రాంతికి థియేటర్లలో ఒక కొత్త ఎనర్జీని నింపిందని నవీన్ అన్నారు. 90లలో గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారిని చూసి ఎలా కేరింతలు కొట్టేవారో, అలాంటి ఎనర్జీని ఆయన థియేటర్లలో తిరిగి తీసుకొచ్చారని అన్నారు. అదే శక్తిని కొనసాగిస్తూ, జనవరి 14న అనగనగా ఒక రాజు థియేటర్లలో అదే వినోదాన్ని అందిస్తుందని నవీన్  చెప్పుకొచ్చారు. రవితేజ కూడా తనకు చాలా ఇష్టమైన వ్యక్తిగా పేర్కొంటూ, చిరంజీవి, రవితేజ లాంటి వారే అని తాను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి హీరో అవ్వాలనుకున్నప్పుడు తన కళ్ళ ముందు కనిపించిన  పేర్లు చిరంజీవి, రవితేజ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.