Natural Star Nani: నానికి పట్టిందల్లా బంగారమే.. సూపర్ హ్యాపీగా నేచురల్ స్టార్..!

| Edited By: Janardhan Veluru

Mar 19, 2025 | 7:21 PM

నేచురల్ స్టార్ నాని సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. నాని తాజా చిత్రం 'కోర్టు రూమ్' కమర్షియల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న నాని..'హిట్ 3', 'ది ప్యారడైజ్' వంటి ఆసక్తికరమైన చిత్రాలతో తన ఫామ్‌ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కథల ఎంపికలో నాని ప్రత్యేకమైన శైలి ఆయన ఫ్యాన్స్‌తో పాటు.. ఇతర సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

Natural Star Nani: నానికి పట్టిందల్లా బంగారమే.. సూపర్ హ్యాపీగా నేచురల్ స్టార్..!
Natural Star Nani
Follow us on

నేచురల్‌ స్టార్ నాని ప్రజెంట్ సూపర్ ఫామ్‌ లో ఉన్నారు. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో నిర్మాతగానూ అదిరిపోయే హిట్‌ అందుకున్నారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్‌ స్టేట్ వర్సెస్ ఎ నోబడి సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. భారీ స్టార్ కాస్ట్‌ లేకపోయినా.. మాస్ కమర్షియల్ సినిమా కాకపోయినా… కోర్ట్‌ మూవీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో సూపర్ హ్యాపీగా ఉన్నారు నాని.

కోర్ట్ సినిమా సక్సెస్‌ విషయంలో ముందు నుంచి చాలా కాన్పిడెంట్‌ గా ఉన్నారు నేచురల్‌ స్టార్‌. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కోర్ట్ నచ్చితేనే త్వరలో రిలీజ్‌ కాబోయే తన హిట్ 3 సినిమా చూడమంటూ రిస్కీ స్టేట్మెంట్‌ ఇచ్చారు. అప్పట్లో నాని చెప్పిన మాటలు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ గా కూడా ఫీల్ అయ్యారు జనాలు. కానీ తన సినిమా మీద నమ్మకంతోనే నాని అంత ధైర్యంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారన్నది కోర్ట్ రిలీజ్ తరువాత ప్రూవ్ అయ్యింది.

దసరా సినిమాకు ముందు కాస్త తడబడిన నాని… ఆ సినిమా సక్సెస్‌ తరువాత పూర్తిగా మారిపోయారు. దసరా తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ అందుకొని వంద కోట్ల హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. అదే జోరులో హాయ్‌ నాన్న, సరిపోదా శనివారం సినిమాలను కూడా హిట్‌ రేంజ్‌ కు తీసుకెళ్లారు. కథల ఎంపికలో ఫస్ట్ నుంచే తన మార్క్ చూపిస్తున్న నాని, నిర్మాతగానూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఫార్ములా సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ మూవీస్‌ ను ప్రొడ్యూస్‌ చేస్తూ అభిరుచి గల నిర్మాతగా ప్రూవ్ చేసుకుంటున్నారు.

అప్‌ కమింగ్ సినిమాల విషయంలోనూ సూపర్ కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు నాని. హిట్ సిరీస్‌ లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ గా తెరకెక్కుతున్న హిట్ 3లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రూల్‌ లెస్‌ కాప్‌ అర్జున్‌ సర్కార్ పాత్రలో మరో డిఫరెంట్ వేరియేషన్ చూపించబోతున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌ లో ఉంది. ఈ సినిమా తరువాత మరోసారి దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌ లో ది ప్యారడైజ్ అనే సినిమాను ఎనౌన్స్ చేశారు. ఫస్ట్ టీజర్‌ తోనే తెలుగు ఆడియన్స్‌కు షాక్ ఇచ్చిన నాని, ది ప్యారడైజ్ మీద అంచనాలు పీక్స్‌ కు తీసుకెళ్లారు. ప్రజెంట్ నాని ఫామ్‌, సెలక్షన్‌, లక్‌ మీద నమ్మకం తో ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ కావటం ఖాయం అంటున్నారు నాని ఫ్యాన్స్‌. అంతేకాదు నేచురల్ స్టార్‌ పట్టిందల్లా బంగారమే అంటూ పొగిడేస్తున్నారు.