Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..

శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో మళ్లీ విజయాల బాట పడ్డాడు నేచురల్‌ స్టార్‌ నాని (Nani). గతేడాది విడుదలైన ఈ సూపర్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది.

Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..
Dasara Movie

Updated on: Mar 20, 2022 | 1:08 PM

శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో మళ్లీ విజయాల బాట పడ్డాడు నేచురల్‌ స్టార్‌ నాని (Nani). గతేడాది విడుదలైన ఈ సూపర్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సక్సెస్‌ను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు నాని. అందుకే వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం దసరా (Dasara Movie)  షూటింగ్‌లో తలమునకలై ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. నేను లోకల్‌లో నానితో కలిసి మెప్పించిన మహానటి కీర్తిసురేశ్‌ మరోసారి నేచురల్‌ స్టార్‌తో జత కట్టనుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. తాజాగా ఈ చిత్రంలో నాని లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

‘స్పార్క్‌ ఆఫ్‌ దసరా’ అంటూ రిలీజ్‌ చేసిన వీడియోలో ఊరమాస్‌ లుక్‌లో కనిపించాడు నేచురల్‌ స్టార్‌. ధరణి అనే పాత్రలో లుంగీ కట్టి, తల నుంచి రక్తం కారుతుండగా.. నడుస్తూ మంటల్లో చేతులు పెట్టి సిగరెట్‌ అంటించాడు. గ్రామస్తులంతా అతని వెనక నడుచుకుంటూ వచ్చారు. ఈ వీడియో నాని అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని విశేషాలను తెలుపుతామని చిత్రబృందం ప్రకటించింది.

Also Read:Clay Water Pot : ఫ్రిజ్ వాటర్ వద్దు.. మట్టి కుండలో నీరు తాగవోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్

Home loan EMI: హోమ్ లోన్ డిఫాల్ట్ అయితే.. ఈ 4 సులభమైన పరిష్కార మార్గాలు మీ కోసం

Megastar Chiranjeevi: మెగాస్టార్ స్పీడ్ మాములుగా లేదుగా.. లైన్ లోకి మరో మలయాళ రీమేక్‌!