Viral Photo: చిరునవ్వులు చిందిస్తోన్న ఈ లిటిల్ ప్రిన్సెస్ వన్నె తెగ్గని అందానికి కేరాఫ్ అడ్రస్.. ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టండి.
చిరునవ్వులతో చిన్నారి దేవకన్యలా ఉన్నా ఈ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టగలరా.. సుధీర్ఘ కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో
చిరునవ్వులతో చిన్నారి దేవకన్యలా ఉన్నా ఈ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టగలరా.. సుధీర్ఘ కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా.. అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా ఇండస్ట్రీని ఏలింది. మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేష్.. నాగార్జున.. మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతోనే కాకుండా.. ప్రభాస్.. ఎన్టీఆర్..యంగ్ హీరోలతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుని మెప్పించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నారికి ఇప్పుడు తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.. గుర్తుపట్టండి..
సుధీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. తన ప్రియుడిని వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఓవైపు కంటెంట్ ప్రాధాన్యత.. లేడి ఓరియెంటెడ్ సినిమాలతోనే కాకుండా.. పాన్ ఇండియా చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తూ సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టండి..
వైట్ డ్రెస్సులో లిటిల్ ప్రిన్సెస్‌లా ముస్తాబైన ఆ చిన్నారి మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్. ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత.. చెన్న కేశవరెడ్డి.. సంతోషం.. ఠాగూర్.. నీకు నేను నాకు నువ్వు.. నేనున్నాను.. ఎలా చెప్పను.. నువ్వే నువ్వే.. సుబాష్ చంద్రబోస్.. అర్జున్.. చత్రపతి.. వంట చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రియా.. ఇప్పుడు మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీలోనూ కీలకపాత్రలో నటించింది.
View this post on Instagram
Also Read: RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్
Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‌లో..
RRR-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..
Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..