Natural star Nani: మాలీవుడ్ పై మనసుపడిన హీరో నాని.. అందుకోసమే ఆ హీరోని తీసుకున్నారా.?

|

Jan 22, 2022 | 2:33 PM

 నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత నాని సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Natural star Nani: మాలీవుడ్ పై మనసుపడిన హీరో నాని.. అందుకోసమే ఆ హీరోని తీసుకున్నారా.?
Nani
Follow us on

Natural star Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత నాని సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి, లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్స్ గా అలరించారు. అలాగే మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని దసరా అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. భారీ జుట్టు, గుబురు గడ్డంతో ఆకట్టుకున్నాడు నాని. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. మొదటిసారి నాని తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది ప్రకటించారు చిత్రయూనిట్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ కీలక పాత్ర కోసం మలయాళ కుర్ర హీరోను తీసుకున్నారని తెలుస్తుంది. మలయాళ యువనటుడు రోషన్ మాథ్యూ ఇందులో కీలక పాత్రను పోషించనున్నారు. ఈసినిమాలో రోహన్ నాని స్నేహితుడిగా కనిపించనున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకోనున్నాడట. ఇంద్రగంటి తెరకెక్కించిన వి చిత్రం తర్వాత మరోసారి నానీ నెగెటివ్ రోల్ ని పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో సముద్రఖని- సాయి కుమార్ -జరీనా వాహబ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో చాలా మంది మన హీరోలు మలయాళంలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, రానా ఇలా మన హీరోలు అక్కడ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. త్వరలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ , చరణ్ కు కూడా అక్కడ ఫాలోయింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. దాంతో ఇప్పుడు నాని కూడా మాలీవుడ్ లో ఫాలోయింగ్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసమే దసరా సినిమాకు మలయాళ యువనటుడు రోషన్ మాథ్యూ ను ఎంపిక చేశారని అంటున్నారు. రోషన్ ఉండటం వల్ల మలయాళం లో సినిమాకు మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారట. నాని నటన అక్కడి ప్రేక్షకుల నచ్చుతుందని.. దాంతో ఆటొమ్యాటిక్ గా ఈ నేచురల్ స్టార్ కు క్రేజ్ వచ్చిదని ఫిలిం నగర్ లో టాక్.  మరి దసరా సినిమాతో నానికి అక్కడ ఫాలోయింగ్ పెరుగుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..