Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు పై టీమిండియా క్రికెటర్ ప్రశంసలు.. కారణం ఇదే

సూపర్ స్టార్ మహేష్ బాబుఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు పై టీమిండియా క్రికెటర్ ప్రశంసలు.. కారణం ఇదే
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2022 | 3:15 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే. మహేష్ బాబును ఆయన అభిమానులు దేవుడిగా భావిస్తుంటారు..  అంతే కాదు దాదాపు 1058 మంది  చిన్నారులకు ప్రాణం పోసి ఆ కుటుంబాలకు నిజంగా దేవుడయ్యాడు మహేష్. గుండె సంబంధింత వ్యాధులతో భాదపడుతున్న చిన్నారులకు వైద్యం అందించి ప్రాణధాత అయ్యాడు మహేష్ బాబు. తాను చిన్నారులకు సేవ చేయడానికి కారణం గురించి గతంలో పలు సందర్భాల్లో చెప్పిన మహేష్.. తాజాగా మరో సారి ఆ కారణాన్ని చెప్పాడు. నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకు మహేష్ బాబు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4 న ఆహా లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మహేష్ ఆసక్తికర విషయాలను బాలయ్య తో పంచుకున్నారు.

అన్నిదానాల కన్నా ప్రాణదానం గొప్పది.. వేయి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్స్ చ్చేయించాడు మహేష్ అని బాలయ్య కొనియాడారు. మహేష్ మాట్లాడుతూ.. తన కొడుకు గౌతమ్ ఆరువారాల ముందే పుట్టాడని.. పుట్టినప్పుడు తన చెయ్యి అంతే ఉన్నాడని అన్నారు మహేష్. ఇప్పుడు దాదాపు ఆరడుగులు ఉన్నాడు. మాకు డబ్బులున్నాయి కాబట్టి ఓకే.. లేనివాళ్లు పరిస్థితి ఏంటి అనిపించింది. అప్పటినుంచి  చిన్న పిల్లలకు సేవ చేస్తున్న అని మహేష్ తెలిపాడు.. దాంతో బాలయ్య మహేష్ ను మెచ్చుకున్నారు. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రోమో పై మహేష్ సేవ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ట్విట్టర్ ద్వారా మహేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాడు.  నిజంగా ఎంతో ఆదర్శవంతం.. వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు వావ్ అంటూ దండం పెట్టె ఎమోజి , చప్పట్లు కొట్టే ఎమోజితో రాసుకొచ్చాడు హనుమ విహారి. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!