Tollywood: అది చేస్తేనే లిప్ లాక్.. డైరెక్టర్‏కే షాకిచ్చిన హీరోయిన్.. ఎవరంటే..

సాధారణంగా హీరోయిన్స్ కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. తమకు ఇష్టంలేకపోయిన కొన్ని సన్నివేశాల్లో నటించక తప్పదు. అయితే పలువురు స్టార్స్ మాత్రం దర్శకనిర్మాతలకే కండీషన్స్ పెడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ లిప్ లాక్ కోసం డైరెక్టర్ కే షాకించిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: అది చేస్తేనే లిప్ లాక్.. డైరెక్టర్‏కే షాకిచ్చిన హీరోయిన్.. ఎవరంటే..
Surabhi Lakshmi

Updated on: Apr 12, 2025 | 8:48 AM

గతేడాది మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో రైఫిల్ క్లబ్ ఒకటి. పెద్ద స్టార్ నటీనటులు లేకుండానే చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. 2024లో ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసింది. ఇందులో దిల్లేష్ పోతన్, వాణి విశ్వనాథ్, దర్శన రాజేంద్రన్, సురభి లక్ష్మీ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీలో లిప్ లాక్ సీన్ చేసేందుకు నటి సురభి లక్ష్మీ వింత కండీషన్ పెట్టిందట. రైటర్ శ్యామ్ స్టోరీ చెప్పినప్పుడే కిస్ సీన్ ఉంటుందని చెప్పాడని.. కానీ షూటింగ్ సెట్ లో మాత్రం లిప్ లాక్ అని చెప్పడంతో షాకయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సురభి లక్ష్మీ.

ఆ చిత్రంలో సంజీవ్ తన భర్త పాత్రలో నటించడాని.. లిప్ లాక్ సీన్ చేసేందుకు టెన్షన్ పడుతన్నారా ? అడిగానని తెలిపింది. అయితే అతడు సిగరెట్ స్మోకర్.. సినిమాలో కూడా చాలా స్మోకింగ్ సీన్స్ కూడా ఉన్నాయని.. అందుకే లిప్ లాక్ సీన్ చేసే ముందు అతడిని బ్రష్ చేసుకోవాలని చెప్పానని గుర్తు చేసింది. అలాగే ఆ సీన్ చేయాలంటే ఫుడ్ సెక్షన్ వాళ్లను పిలిచి యాలకులు తెమ్మని చెప్పానని.. వాటిని తినమని ఇచ్చానని.. ఎలాగోలా ఆ సీన్ పూర్తి చేశామని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

సురభి లక్ష్మీ 2017లో మిన్నమినుంగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఇందులో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. మలయాళంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?