Narendra Modi: సిరివెన్నెల సతీమణికి ప్రధాని మోడీ లేఖ.. ఆయనను స్మరించుకుంటూ…

|

Dec 07, 2021 | 7:43 PM

లెజెండ్రీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మన మధ్య లేదు అనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు సినీ ప్రేమికులు.

Narendra Modi: సిరివెన్నెల సతీమణికి ప్రధాని మోడీ లేఖ.. ఆయనను స్మరించుకుంటూ...
Modi
Follow us on

Sirivennela Seetharama Sastry: లెజెండ్రీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మన మధ్య లేరు అనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు సినీ ప్రేమికులు. పదాలతో తెలుగు భాషపై ప్రేమ మరింత పెంచే రచయిత సిరివెన్నెల. అనారోగ్యం కారణంగా సిరివెన్నెల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినీలోకానికి తీరని లోటు.. సిరివెన్నెల కుటుంబసభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. ఈ మేరకు ఆయన సిరి వెన్నెల సతీమణికి లేక రాసారు. “శ్రీమతి పద్మావతి జీ..శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరణించడం చాలా బాధాకరం. తీవ్ర దుఃఖంతో కూడిన ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. బహుముఖ కవి, శ్రీ శాస్త్రి జీ తన స్వరకల్పనల ద్వారా ఆ కాలంలోని సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా విస్తృతంగా ప్రసిద్ది చెందారు. తన సృజనాత్మకతతో సాహిత్య, సినిమా ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు.

శ్రీ సిరివెన్నెల శాస్త్రి గారు తెలుగు భాషపై పట్టును కలిగి ఉన్నా వ్యక్తే కాదు.. పదం పట్ల భావాన్ని కలిగి ఉన్న వ్యక్తి కూడా. తెలుగును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన అలసిపోయారు.. కళ మరియు సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సహకారానికి పద్మశ్రీ లాంటి  ఇతర అవార్డులతో సత్కరించారు. ఆయన  మరణం తెలుగు సాహిత్య రంగంలో లోతైన శూన్యాన్ని నింపింది. ఆయన మీ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆయన మృతితో మీ కుటుంబాలకు కలిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. మీకు మీకుటుంబసభ్యులను సానుభూతీ తెలియజేస్తున్నా.. మీకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను, సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ భావోద్వేగ లేఖను రాసారు మోడీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..