OG Movie: ‘ఓజీ’కి కొత్త అర్థం చెప్పిన నారా లోకేష్.. పవన్ కల్యాణ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్ 'ఓజీ' చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఓజీ కి సరికొత్త అర్థం చెప్పారాయన.

OG Movie: ‘ఓజీ’కి కొత్త అర్థం చెప్పిన నారా లోకేష్.. పవన్ కల్యాణ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్
Nara Lokesh, Pawan Kalyan

Updated on: Sep 25, 2025 | 7:20 AM

పవర్ స్టార్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తోన్న ‘ఓజీ’ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టింది. అభిమానుల కోలాహలం నడుమ గురువారం (సెప్టెంబర్ 24) రాత్రి నుంచే ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓజీ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు ఓజీ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా ఓజీ టీమ్ కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. పవన్ కల్యాణ్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఓజీ మూవీ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన నారా లోకేశ్.. ‘OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్‌ గాడ్‌. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని విషెస్ చెప్పారు.

అంతకు ముందు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఓ కీలక ప్రకటన చేశారు. తనే దగ్గర ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా ఓజీ సినిమా విడుదల అయ్యేలా చూస్తా’ అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈరోజు విడుదల అయ్యే మన పవన్ కల్యాణ్ గారి సినిమా కి నా హృదయపూర్వక అభినందనలు. పవన్ మంచి మనసున్న మంచి మనిషి. అంధకార సమయంలో మా పార్టీకి అండగా నిలిచి అచంచలమైన మద్దతు ఇచ్చారు. మేము కూడా ఆయన కోసం ఎప్పటికీ నిలబడతాం. అనంతపురలో నేనే దగ్గర ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా ఓజీ సినిమా విడుదల చేయిస్తా’ అని ట్వీట్ చేశారు దగ్గుబాటి ప్రసాద్.

ఇవి కూడా చదవండి

నారా  లోకేష్ ట్వీట్..

టీడీపీ ఎమ్మెల్యే పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.