Shyam Singha Roy: ఆకట్టుకుంటున్న వాసు లుక్.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్యామ్ సింగ రాయ్

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని డ్యూయెల్ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''శ్యామ్ సింగ రాయ్''. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది..

Shyam Singha Roy: ఆకట్టుకుంటున్న వాసు లుక్.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్యామ్ సింగ రాయ్
Shyam Singha Roy

Updated on: Oct 14, 2021 | 6:49 PM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని డ్యూయెల్ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ”శ్యామ్ సింగ రాయ్”. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. తాజాగా దసరా పండగ సందర్భంగా నాని రెండో పాత్ర వాసుని ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర యూనిట్.  కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ.. కాళీ మాత పోస్టర్ నుంచి వాసు లుక్ ని రివీల్ చేశారు. మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కాళీమాత నేపథ్యంలో ఉన్న నాని ఫోటో ఆకర్షణీయంగా ఉంది. వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేశారు. శ్యామ్ సింగ రాయ్ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతోందని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.

సాయి పల్లవి,కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని – సాయి పల్లవి – కృతి శెట్టి ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read:   మహిళలకు దసరా స్పెషల్.. రూ. 50 లకే కొత్త చీర.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?