Aha-Nandamuri Balakrishna: దుమ్మురేపిన బాలయ్య.. అదిరిపోయిన ప్రోమో.. స్పీచ్‌లో ఇంట్రస్టింగ్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ తనలోని నయా షేడ్ చూపించబోతున్నారు. తెలుగువారి ఫేవరెట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు
నందమూరి నటసింహం బాలకృష్ణ తనలోని నయా షేడ్ చూపించబోతున్నారు. తెలుగువారి ఫేవరెట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు బాలయ్య. ఈ టాక్ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి ఫెస్టివల్ కానుకగా నవంబరు 4న ఈ ప్రొగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. త్వరలో ఈ షోకు టాలీవుడ్ బడా స్టార్స్, టెక్నిషియన్స్ రానున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ షో పరిచయ వేడుకలో పాల్గొన్న బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారని.. అందుకే ఈసారి వారి ముందకు వ్యాఖ్యతగా రాబోతున్నట్లు తెలిపారు. సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ అభిమానులను, ప్రేక్షకులను అలరించడమే తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఇప్పటికే విభిన్న పాత్రలు చేసినా, విభిన్న కథలు ఎంచుకున్నా.. ఇంకా ఎంతో చేయాలని తెలుగు జాతి ప్రేరణ ఇస్తోందని చెప్పారు. ‘ఆహా’ ఓటీటీ అల్లు అరవింద్ మానస పుత్రిక అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా ‘ఆహా’ను ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఇండస్ట్రీ మొత్తంలో ఒక్క అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేదని పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా ఎంతో మంది యువతీ యువకులు ఈ షో కోసం పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.
ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని… అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుందని బాలయ్య చెప్పారు. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందని.. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయన్నారు. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో తనకు బాగా నచ్చిందని. అందుకే ఒప్పుకొన్నట్లు తెలిపారు. మళ్లీ కలుద్దాం.. ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్” అని బాలకృష్ణ చెప్పారు.
Also Read: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండా అదేనన్న మంచు విష్ణు