Tuck Jagadish: రిలీజ్ కు రెడీ అవుతున్న టక్ జగదీష్.. డేట్ ఫిక్స్ చేసే పనిలో చిత్రయూనిట్

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వలో చేస్తున్న టక్ జగదీష్ సినిమాను కంప్లీట్ చేసాడు నాని.

Tuck Jagadish: రిలీజ్ కు రెడీ అవుతున్న టక్ జగదీష్.. డేట్ ఫిక్స్ చేసే పనిలో చిత్రయూనిట్
Nani

Updated on: Jul 06, 2021 | 9:55 PM

Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వలో చేస్తున్న టక్ జగదీష్ సినిమాను కంప్లీట్ చేసాడు నాని. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నానికి జోడీగా రీతువర్మ నటిస్తుంది. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో “టక్ జగదీష్” సినిమా కూడా వాయిదా పడింది. దాంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా అడ్డు పడింది. కరోనా సెక్ వేవ్‌ తెలుగు రాష్ట్రాలను ముంచేయడంతో ఓటీటీ వైపు టక్ జగదీష్ టీం చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

కాని అవన్నీ నిజం కాదంటూ టక్‌ జగదీష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.  త్వరలోనే థియేటర్లను తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. త్వరగా ఒక రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తో పాటు నాని టాక్సీవాలా దర్శకుడితో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nithya Menen: లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ హీరోయిన్.. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో..

Aishwarya Rajesh: నమ్మిన వ్యక్తే నన్ను మోసం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

Actress Saranya: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు