న్యాచురల్ స్టార్ నాని, కిచ్చా సుదీప్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాలో నాని , సుదీప్ కలిసి నటించారు. నాటి నుంచి నేటి వరకు వీరి స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రానికి సపోర్ట్ చేశాడు సుదీప్. ఇందులోనుంచి లేటెస్ట్‌గా ‘ప్రతి కూతురు కోసం నాన్న పాట.. గాజు బొమ్మ’ అంటూ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఆలపించారు. కాగా ఈ పాట కన్నడ వెర్షన్‌ను హీరో సుదీప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘హాయ్ నాన్న’ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. నా తమ్ముడు నానితో పాటు టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ నాని పాటను ప్రజెంట్ చేస్తూ సుదీప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను నాని రీట్వీట్ చేస్తూ.. ‘థ్యాంక్యూ బ్రదర్’ అని చెప్పుకొచ్చాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథాంశంతో ‘హాయ్ నాన్న’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా హాయ్ నాన్న సాంగ్‌ను తెలుగులో మహేష్ బాబు, తమిళ్‌లో శివ కార్తికేయన్, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్‌తో పాటు దుల్కర్ సల్మాన్, శివ కార్తికేయన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
కాగా దసరా సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రియులను అలరించాడు. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు నాని. ఈ సినిమాతో డైరెక్టర్ శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నాని గారాల పట్టిగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ స్వరాలు సమకూరుస్తున్నాడు.కాగా డిసెంబర్ 21న ఈ సినిమాను పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Thank you siva ♥️ @Siva_Kartikeyan
See you soon 🤗#KannaadiKannaadi https://t.co/mfjdRVtkLy— Nani (@NameisNani) October 6, 2023
Thank you Anna ♥️ @KicchaSudeep #Magalalla https://t.co/2AR1p21Ctb
— Nani (@NameisNani) October 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.