Actor Nani : షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి కొడుకుతో ఆటలాడుతున్న నాని.. వీడియో వైరల్

|

May 02, 2021 | 6:50 AM

సినిమాలతో బిజీగా ఉండే నాని.. ఇప్పుడు తన కొడుకుతో కాస్త టైం స్పెండ్ చేస్తున్నాడు. అంతేకాదు తీరిగ్గా కబుర్లు చెబుతూ.. గేమ్‌స్ కూడా ఆడుతున్నాడు.

Actor Nani : షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి కొడుకుతో ఆటలాడుతున్న నాని.. వీడియో వైరల్
Follow us on

Actor Nani :

సినిమాలతో బిజీగా ఉండే నాని.. ఇప్పుడు తన కొడుకుతో కాస్త టైం స్పెండ్ చేస్తున్నాడు. అంతేకాదు తీరిగ్గా కబుర్లు చెబుతూ..  గేమ్‌స్ కూడా ఆడుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇప్పటికే టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు నాని. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని.

అయితే ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో హీరో నాని తన ఫ్యామిలీతో ఫుల్‌గా టైం స్పెండ్‌ చేస్తున్నాడు. స్పెషల్లీ తన కొడుకు అర్జున్‌తో కలిసి ఆడుకుంటూ హంగామా చేస్తున్నాడు. అలా ఆడుతూ.. తీసిన ఓ వీడియోని నాని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ వీడియోలో అర్జున్‌ బుల్లి బుల్లి మాటలకు ఫిదా అయిన సమంత కూడా.. లవ్‌ ఎమోజీలతో కమెంట్‌ చేసింది మరి..!

మరిన్ని ఇక్కడ చదవండి :

KGF Movie: కేజీఎఫ్ 2లో మరో స్పెషల్ సాంగ్.. ఈసారి యశ్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీస్..

నీలా డబ్బుకోసం తలపాగా ధరించను..! అక్షయ్ కుమార్‌పై హాట్ కామెంట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్..?

Ritu varma: కొండ‌ల్లో, కోన‌ల్లో సుంద‌రాంగి.. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న రీతూ వ‌ర్మ‌