Nani 30: నాని వెరైటీ ప్రమోషన్స్.. గాలిలో వేలాడుతూ తన 30వ మూవీ అప్డేట్ ఇచ్చారు

రీసెంట్ గా నాని దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడితో ఈ సినిమా చేశారు నాని.మాస్ మసాలా కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో 30వ సినిమాతో రానున్నాడు.

Nani 30: నాని వెరైటీ ప్రమోషన్స్.. గాలిలో వేలాడుతూ తన 30వ మూవీ అప్డేట్ ఇచ్చారు
Nani 30

Updated on: Jul 12, 2023 | 10:14 AM

సినిమాల ప్రమోషన్స్ లో మేకర్స్ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమాకు కూడా వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా నాని దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడితో ఈ సినిమా చేశారు నాని.మాస్ మసాలా కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో 30వ సినిమాతో రానున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శృతి హీరోయిన్ గాను నటిస్తుందని టాక్.

ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ అప్ డేట్ ను ఇచ్చారు నాని. ఈ సినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాకు డియర్ నాన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

తాజాగా నాని గాలిలో వేలాడుతూ వెరైటీగా అప్డేట్ ఇచ్చారు. స్కై డైవింగ్ చేస్తూ.. తన 30వ సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసే డేట్ ను అనౌన్స్ చేశారు. జులై 13వ తేదీన ఈ మూవీ గ్లింమ్స్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us