HIT 2: శేష్ టెన్షన్.. నాని రియాక్షన్.. వైరల్ అవుతున్న వీడియో.. హిట్ 2 గురించి ఏమంటున్నారంటే

|

Nov 22, 2022 | 6:55 AM

కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కనిపించిన శేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

HIT 2: శేష్ టెన్షన్.. నాని రియాక్షన్.. వైరల్ అవుతున్న వీడియో.. హిట్ 2 గురించి ఏమంటున్నారంటే
Nani, Adavi Sesh
Follow us on

యంగ్ హీరో అడవి శేష్ విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కనిపించిన శేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత హీరోగా నటించిన క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమా లు హిట్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా చేసిన మేజర్ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారం గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో వచ్చిన హిట్ సినిమా విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు.

ఇక ఇప్పుడు మరోసారి నాని నిర్మాతగా హిట్ 2ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శైలేష్ కొలను ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో నాని శేష్ కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని శేష్ టెన్షన్ పడుతుంటే.. నాని మాత్రం చాలా కూల్ గా ‘హిట్’ సినిమా సూపర్ హిట్ అంటూ సమాధానమిచ్చారు. అలాగే సినిమా డిస్టిబ్యూషన్ గురించి శేష్ అడుగుతుంటే అన్ని అమ్ముడుపోయాయి అని నాని చెప్పుకొచ్చాడు. ఇక నేను ట్రైలర్ చూశాను.. సినిమా హిట్ అని నాని చెప్తుంటే మరి ప్రేక్షకులు చూడొద్దా అని శేష్ ప్రశ్నించగా నవంబర్ 23న ట్రైలర్ రాబోతోందని నాని తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..