Geetu Royal: రీ ఎంట్రీపై కుండబద్దలు కొట్టిన గీతూ రాయల్.. రేవంత్ ఏడుపుపై కూడా సంచలన కామెంట్స్

బిగ్ బాస్ గురించి తన మనసులోని అన్ని మాటలు చెప్పేసింది గీతూ. కంటెస్టెంట్స్ గురించి కూడా తన అభిప్రాయాలు పంచుకుంది.

Geetu Royal: రీ ఎంట్రీపై కుండబద్దలు కొట్టిన గీతూ రాయల్.. రేవంత్ ఏడుపుపై కూడా సంచలన కామెంట్స్
Bigg Boss Geetu Royal
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 22, 2022 | 9:26 AM

గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి, షాక్‌కు గురి చేసింది. ఏ మాటకామాటే ఆమె ఆట మాత్రం ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్‌లోని కంటెస్టెంట్స్ అందరికంటే భిన్నం. అయితే బయట మాత్రం ఆమె ఆటతీరును వ్యతిరేకించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఓటింగ్ వల్లో, కావాలనే పంపారో తెలియదు కానీ రేటింగ్ తగ్గుతుందని తెలిసినా గీతూ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఊహించని ఎలిమినేషన్‌తో ఒక్కసారిగా ఆవేదనకు గురై.. నైరాశ్యంలోకి వెళ్లిన గీతూ ఇప్పుడిప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో నెటిజన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందరూ రీ ఎంట్రీ గురించి అడుగుతున్నారని.. తనను ఎవరూ పిలవలేదని.. పిలిచినా పోకూడదని అనుకున్నట్లు స్పష్టం చేసింది. ఆమె చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

1 . నెటిజన్ : సేఫ్ గేమ్ ఆడుతున్నా ఆదిరెడ్డికే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు..?

గీతు:  ఆదిరెడ్డి సేఫ్ గేమ్ ఆడడు. అలా ఆడేవాడే అయితే బిగ్ బాస్‌ను, హోస్ట్‌ను ఎదిరించి మాట్లాడడు. ఆదిరెడ్డిలో దమ్ము ఉంది. అతను జాలి మనిషి. ఎదిటివాళ్లను హర్ట్ చేయకూడదు అనుకుంటాడు. ప్రేమ, ఆప్యాయత వల్ల కొన్నిసార్లు డిప్లమేటిగ్‌గా మాట్లాడతాడు.

2. నెటిజన్ : శ్రీహాన్ గురించి చెప్పండి..?

గీతు: నాదీ, శ్రీహాన్‌ది తొలుత నెగటివ్ రిలేషన్. కానీ పానీ పూరిలో ఉప్పు వేసి ఇచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటే.. నా బాధ అర్థం చేసుకుని మిర్యాల పాలు ఇచ్చాడు. అప్పుడు చాలా రిలీఫ్ అనిపించింది. అప్పటి నుంచి అతడు నామినేట్ చేసినా.. ఏమి అనుకూడదని ఫిక్స్ అయ్యా. నేను ప్రేమకు లొంగిపోతా. అతడు నాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్.

3. నెటిజన్ : ఎలిమినేషన్ నుంచి రికవర్ అయ్యారా..?

గీతు: ఆ పదం చూస్తుంటేనే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయ్. షాక్ నుంచి ఇంకా బయటకు రాలా. ఆ రోజు నేను బట్టలు సర్దుకోలా. అంతలా ఎలిమినేట్ అవ్వనని ఫిక్సయ్యా. నా లైఫ్‌లో అదే హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. బాగా హర్టయ్యా. నాకు షో అంటే చెప్పలేనంత ఇష్టం. ఉన్నంతకాలం ప్రాణం పెట్టి ఆడా.

4. . నెటిజన్ :  రేవంత్ మీపై చూపే ప్రేమ నిజమేనా..? అతను మిమ్మల్ని బిగ్ బాస్ ఇంట్లో చాలాసార్లు తిట్టాడు..? కానీ మీ ఎలిమినేషన్ అప్పుడు ఏడ్చాడు..?

గీతు: ఈ విషయంపై నాకూ క్లారిటీ రాలేదు. రేవంత్ నాతో బాగున్నాడు. కానీ పక్కకు వెళ్లి బ్యాడ్ గా మాట్లాడాడు. నా ఎలిమినేషన్‌ అతడి ఏడుపు మాత్రం రియల్ అనిపించింది. అతను నా ముందు బాగున్నాడు. నా వెనక మాత్రం బాలేదు.

5. నెటిజన్ : బిగ్ బాస్ జర్నీ బెస్ట్ మూమెంట్ ఏంటి..?

గీతు: ఆ మూమెంట్ టెలికాస్ట్ కాలేదు. ఒక విషయంలో నేను కన్‌ఫెషన్ రూమ్‌కి వెళ్లిన్పపుడు.. వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు బిగ్ బాస్ నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చివర్లో Valar Dohaeris అనే పదం ఉపయోగించారు. అది నా లైఫ్‌లోనే బెస్ట్ మూమెంట్.

6. నెటిజన్ : కీర్తిని శ్రీహాన్, సత్య టార్గెట్ చేస్తున్నారు..? దానిపై మీ ఒపినియన్..?

గీతు: ఇంట్లో కొన్ని సిట్యువేషన్స్ వల్ల కొందరిపై కోపం వస్తుంది. కొందరిపై ద్వేషం వస్తుంది. ఇంకొందరితో స్నేహం పెరుగుతుంది. కీర్తి ముందు మంచిగా మాట్లాడి.. మన వెనక తప్పుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది.

7. నెటిజన్ : మీ ఒపినియన్‌లో టాప్ -5 లో ఎవరుంటారు..?

గీతు: నేను గేమ్ పరంగా చూస్తా. గేమ్ అంటే అన్నీ.. టాస్కులు మాత్రమే కాదు. అలా చూస్తే.. ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, రేవంత్, నేను ఉంటే నేను, నేను లేను కాదు కాబట్టి ఇనయ. రోహిత్ కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

8. నెటిజన్ : ఫైమా గురించి చెప్పింది..?

గీతు: ఫైమా చూస్తుంటే చాలా బాధేస్తుంది. లేని వాళ్లంటే జనాలకు ఎప్పుడూ చులకనే అనిపిస్తుంది. తను రూరల్ ఏరియాలో పెరిగింది. ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ తను చాలా ఆడుతుంది. ఆమె టాప్-3లో ఉంటుంది.

ఇంకా వివరాలు కావాలంటే గీతూ ఇన్ స్టా స్టోరీ చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..