Shahrukh Khan: షారుఖ్‌ ఇంటి నేమ్‌ ప్లేట్‌కు అన్ని లక్షలా.? రేట్‌ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌.. ఈ పేరును ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కెరీర్‌తొలి నాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగారు..

Shahrukh Khan: షారుఖ్‌ ఇంటి నేమ్‌ ప్లేట్‌కు అన్ని లక్షలా.? రేట్‌ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Shahrukh Khan Mannat
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2022 | 9:50 PM

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌.. ఈ పేరును ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కెరీర్‌తొలి నాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగారు ఈ బాద్‌షా. షారుఖ్‌ ఖాన్‌ ఎంత పాపులారో ఆయన కలల సౌథం మన్నత్‌ కూడా అందే పాపులార్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబైకి వెళ్లిన వారు మన్నత్‌ను కూడా చూడాలని ప్లాన్‌ చేస్తారనడంలో ఎలాంటి సంశయం లేదు. అత్యంత విలాసవంతమైన ఈ భవనం విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా.

ఇదిలా ఉంటే తాజా షారుఖ్‌ ఇల్లు మన్నత్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఇంటి నేమ్‌ప్లేట్‌తో మన్నత్ వార్తల్లోకి ఎక్కింది. ఇంటి గేట్‌కు వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌ ప్లేట్‌కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. రాత్రిపూట దగదగమంటూ మెరుస్తోన్న వజ్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అభిమానులు నేమ్‌ప్లేట్‌ వద్ద ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ నేమ్‌ప్లేట్‌ సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక షారుఖ్‌ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం పటాన్‌తో పాటు జవాన్‌ సినిమాల్లో నటిస్తున్నారు. పటాన్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక జవాన్‌ చిత్రం 2023, జూన్‌2వ తేదీన విడుదల కానుంది. వీటితో పాటు టైగర్‌ 3 చిత్రాన్ని కూడా తెరకెక్కించే ప్లాన్‌ ఉన్నారు షారుఖ్‌. ఇదిలా ఉంటే షారుఖ్‌కు తాజాగా రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ పెస్టివల్‌లో గౌరవ పురస్కారం లభించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..