JETTY Trailer : ‘నటసింహం’ బాలకృష్ణ చేతుల మీదుగా ‘జెట్టి’సినిమా ట్రైలర్.. తండ్రి ఆశయాన్ని సాధించే కూతురి కథ

JETTY: నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

JETTY Trailer : 'నటసింహం' బాలకృష్ణ చేతుల మీదుగా 'జెట్టి'సినిమా ట్రైలర్.. తండ్రి ఆశయాన్ని సాధించే కూతురి కథ
Jetty
Follow us

|

Updated on: Oct 21, 2021 | 9:22 PM

నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “జెట్టి” సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన..చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

“జెట్టి” ట్రైలర్ చూస్తే…నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా రాజీలేని పోరాటం చేస్తుంది. జెట్టి వల్ల పర్యాటకం పెరిగి ఊరు బాగుపడుతుంది. జనం బాగుపడటం ఇష్టంలేని విలన్లు జెట్టి కాదు కదా మట్టిని కూడా తీసుకురానివ్వం అంటూ అడ్డుపడుతుంటారు. హీరో మాన్యం కృష్ణ మాన్యం అనే పాత్రలో నటించారు. అతని సహాయంతో ఈ ప్రతినాయకుల స్వార్థాన్ని నాయిక ఎలా ఎదుర్కొంది, వీళ్లంతా ఊరికి జెట్టిని తీసుకొచ్చారా లేదా అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. సినిమా మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sammathame Movie: కిరణ్ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’.. ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్ గ్లింప్స్

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్