Tollywood: ఈ అబ్బాయి ఇప్పుడు హీరో.. ఇండస్ట్రీకి మోతే.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Sep 06, 2024 | 5:26 PM

ఈ ఫోటోలోని అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..?. ఇండస్ట్రీలోని ఓ పెద్ద ఫ్యామిలీకి చెందినవాడు. ఇవాళ నెట్టింట మస్త్ ట్రెండ్ అవుతున్నాడు. అతని క్రేజ్ చూస్తుంటే.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.. తనెవరో మీరు గుర్తుపట్టారా..?

Tollywood: ఈ అబ్బాయి ఇప్పుడు హీరో.. ఇండస్ట్రీకి మోతే.. ఎవరో గుర్తుపట్టారా..?
Hero Childhood Photo
Follow us on

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఎవరో గుర్తు పట్టారా?… ఒక చిన్న క్లూ ఇస్తా.. గుర్తు పడతారా మరి… సినీ ఇండస్ట్రీకి ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేసిన ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.  సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి వెండితెరపైకి రాబోతున్న యంగ్‌ హీరో… క్లారిటీ వచ్చిందా?… ఒక కన్‌క్లూజన్‌కి వచ్చేశారా?… త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవబోతున్న ఆ యంగ్‌ హీరో ఎవరో కనిపెట్టేశారా..?  ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత ఐటెంటిఫై చేయకుండా ఉంటారా?.. బహుశా… అర్థమయ్యే ఉంటుందనుకుంటా. అవును.. అతను నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.
అవును.. బాలయ్య వారసుడు వచ్చేశాడు… వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కన్ఫామ్‌ అయ్యింది. నందమూరి మోక్షజ్ఞ బర్త్‌ డే సందర్భంగా.. సింబా ఈజ్‌ కమింగ్‌… అంటూ.. ఆయన తొలి సినిమా టీమ్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. అంతే… అట్టా.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయిందో… లేదో… ఆల్‌ ది బెస్ట్‌ అంటూ విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక.. హనుమాన్‌ ఫేమ్, యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా తొలి సినిమా రాబోతోంది. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రాబోతున్న మూవీలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. SLV సినిమాస్‌, లెజెండ్‌ ప్రొడక్షన్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం.. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కబోతోంది. ఈ మూవీని సుధాకర్‌ చెరుకూరి, మోక్షజ్ఞ చిన్న అక్క తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సో.. ఇదన్నమాట సంగతి. రెండు రోజుల నుంచి వరుస పోస్టులతో హింట్‌లు ఇస్తూ సస్పెన్స్‌కు గురి చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ.. ఎట్టకేలకు.. ఆ ఉత్కంఠకు తెరదించారు. ఇవాళ నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ మూవీ.. ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.