AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amigos: కళ్యాణ్ రామ్ సినిమానుంచి.. ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ’

ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీత్ రాబోతున్నారు.కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  

Amigos: కళ్యాణ్ రామ్ సినిమానుంచి.. ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ'
Amigos
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2023 | 8:16 AM

Share

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు  సంపాదించుకున్నారు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీత్ రాబోతున్నారు.కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి.

మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ధ‌ర్మ క్షేత్రం సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్‌. ధ‌ర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాట‌ను  ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాట‌కు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్ ఆల‌పించారు. ఈ క్లాసిక్ సాంగ్‌ను ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్‌తో పాటు స‌మీర భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు. ఇళ‌య రాజా అందించిన ఈ ట్రాన్సింగ్ ట్యూన్ మ‌న‌ల్ని మ‌రో ప్ర‌పంచ‌లోకి తీసుకెళుతుంది.

ఈ వీడియో సాంగ్‌ క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ మ‌ధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేస్తుంది. చ‌క్క‌టి ట్యూన్‌కి త‌గ్గ సాహిత్యం,  విజువ‌ల్స్ ఆడియెన్స్ క‌ళ్ల‌కు ట్రీట్‌లాగా ఉంది. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంటే.. క‌ళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. బెస్ట్ సాంగ్స్ ప్లే లిస్ట్‌లో ఈ రీమిక్స్ సాంగ్ స్థానం ద‌క్కించుకుంటుంద‌న‌టంలో సందేహం లేదు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..