నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య… ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. బుధవారం బాలకృష్ణ విజయవాడలోని ఓ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడ బందర్ రోడ్డుకు కారులో వెళ్లారు. అక్కడ నూతనంగా ఎర్పాటు చేసిన వేగ జ్యుయెలరీ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ జ్యుయెలరీ బ్రాండ్ కు బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
షోరూం ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో ముచ్చటించారు బాలయ్య. ఈ క్రమంలోనే బాలయ్యను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఓ మాస్ సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగు సంస్థ వేగ జ్యుయెలర్స్ విజయవాడలో పుట్టి తెలుగు సంప్రదాయ నగల వైభవాన్ని దేశమంతటా వ్యాప్తి చేయడానికి అడుగులు వేస్తోందని అన్నారు బాలయ్య.
తన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. వైవిధ్యమైన సినిమాలు చేయాలని తనపతో చేస్తున్నాని.. ప్రగ్యా జైస్వాల్ తో చేసిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారని.. అలాగే అన్ స్టాపబుల్ టాక్ షో మొదటిసారి చేశానని..ఇప్పుడు అది ప్రపంచంలోనే అన్ని టాక్ షోలలో నంబర్ వన్ గా నిలిచిందని అన్నారు బాలయ్య.
Selfie ?#nandamuribalakrishna #nbk pic.twitter.com/Z9JNpdf47z
— NBK? (@Royal_Nandamuri) March 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.