Natyam Movie : ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నేడు ( 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా ఈ సినిమాను నట సింహం నందమూరి బాలకృష్ణ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా ఉంది అన్నారు. మరుగున పడుతున్న కళలను తిరిగి తెరపైకి తీసుకురావడం అభినందనీయం అన్నారు బాలయ్య. నాట్యం సినిమా కాదు ఒక కళాఖండం అన్నాడు బాలయ్య. సినిమా కేవలం వినోదం కోసమే కాదు..దాని వెనక ఒక సందేశం.. మరుగున పడుతున్న కళకు తిరిగి జీవం పోసి భావితరాలు అందించిన ఘనత సంధ్యారాజు కు చెందుతుంది అన్నారు బాలకృష్ణ.
దర్శకుడు రేవంత్ గురించి మాట్లాడుతూ.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించారు బాలయ్య. కెమెరామెన్ , దర్శకుడు ఆయన కావడంతో సినిమాను మరింత అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు. సన్నివేశాలను చక్కగా క్యాప్చర్ చేశారని అన్నారు. సినిమాను ఎన్నిసార్లు చుసిన తనివి తీరదని అన్నారు బాలకృష్ణ. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అందరు అద్భుతంగా తమ తమ పాత్రల్లో నటించారని బాలకృష్ణ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :