Nandamuri Balakrishna : లైగర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లయన్.. నట సింహం ఎంట్రీతో సెట్‌లో సందడి..

విజయ్ దేవరకొండ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ  లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది

Nandamuri Balakrishna : లైగర్ టీమ్‌ను  సర్‌ప్రైజ్ చేసిన లయన్.. నట సింహం ఎంట్రీతో సెట్‌లో సందడి..

Updated on: Sep 22, 2021 | 1:54 PM

vijay devarakonda liger:  విజయ్ దేవరకొండ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ  లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ గోవాలో చిత్రీకరిస్తున్నారు. ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నారు. విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఓ ముఖ్య అతిథి సెట్‌లోకి అడుగు పెట్టి అందరికి సర్‌ప్రైజ్ చేశారు. ఆయన ఎవరంటే నటసింహ నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్‌కు వచ్చారు. గోవాకు దగ్గర్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో లైగర్ సెట్‌లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ.

లైగర్ సెట్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్‌ మీద బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. లైగర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ
టీంకు కంగ్రాట్స్ తెలిపారు నందమూరి బాలకృష్ణ. మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ డ్రామా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Telugu 5: హమ్మయ్యా.. షణ్ముఖ్ ఫామ్‌‌లోకి వచ్చేశాడు… శ్వేతా భుజంపై చేయివేసి..