Jailer 2: రజనీకాంత్ జైలర్ 2లో ఆ టాలీవుడ్ స్టార్ హీరో! బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ

|

Jan 14, 2025 | 3:16 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' టీజర్ మంగళవారం (జనవరి 14) సాయంత్రం విడుదల కానుంది. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.

Jailer 2: రజనీకాంత్ జైలర్ 2లో ఆ టాలీవుడ్ స్టార్ హీరో! బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ
Jailer 2 Movie
Follow us on

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆకట్టుకునే కథా కథనాలు, అద్భుతమైన నేపథ్య సంగీతం, ముఖ్యంగా స్టార్ హీరోల అతిధి పాత్రలు సినిమాకు భారీ వసూళ్లు తెచ్చిపెట్టాయి. అన్నిటికీ మించి వరుస పరాజయాలతో సతమతమవుతున్న రజనీకాంత్‌కి జైలర్ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా ‘జైలర్ 2’ సినిమా కూడా వస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ క్రేజీ సీక్వెల్ సినిమా ప్రోమో విడుదల కానుంది. ఇందుకోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ సినిమాలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ యాక్టర్లు అతిథి పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా శివన్న పోషించిన నరసింహా రోల్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ‘జైలర్ 2′ సినిమాలో శివన్న అదే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే.. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తారని సినిమా సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది. నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్స్ తో `జైలర్‌ 2`ని ప్లాన్‌ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రజనీ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. సాయంత్రం రిలీజయ్యే టీజర్ లో నైనా దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

జైలర్’ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ‘జైలర్ 2’ చిత్రాన్ని కూడా ఈ సంస్థనే తెరకెక్కింనుంది. సీక్వెల్ లో మరిన్ని హంగులు ఉండనున్నాయని, ఈ క్రమంలోనే బాలయ్య కూడా నటించనున్నారని సమాచారం. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన నెల్సన్ సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈసారి కూడా తమన్నా భాటియా ఐటెం సాంగ్‌లో కనిపించనుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

గ్యాంగ్ స్టర్ పాత్రలో బాలకృష్ణ..

రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ఆ తర్వాత ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. కాగా మరికాసేపట్లో ‘జైలర్ 2’ సినిమా రెండు టీజర్లు విడుదల కానున్నాయని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.