Balakrishna: బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ 

|

May 29, 2022 | 3:14 PM

నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ 'బసవతారకరామ క్రియేషన్స్' పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు.

Balakrishna: బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ 
Balakrishna
Follow us on

నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao)శతజయంతి సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna) ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు.

బ్యానర్ లాంచ్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ కి శ్రీకారం చుట్టిన అన్నయ్య జయకృష్ణ గారికి అభినందనలు. ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. మా అమ్మగారు, నాన్నగారి పేర్లు కలిసోచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్ కి పేరు పెట్టడం చాలా ఆనందంగా వుంది. ఈ బ్యానర్ ద్వారా నందమూరి చైతన్య కృష్ణ హీరో గా పరిచయం కావడం ఆనందంగా వుంది. నాన్నగారికి చైతన్య కృష్ణ చాలా ఇష్టమైన మనవడు. చైతన్య కృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. చాలా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళకు నా బెస్ట విశేష్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు

నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ బ్యానర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా మా అబ్బాయి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు. అలాగే హీరో చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన ‘బసవతారకరామ క్రియేషన్స్’బ్యానర్ ని బాబాయ్ బాలకృష్ణ గారు లాంచ్ చేయడం, ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా వుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..