NBK107: బాలకృష్ణ పుట్టినరోజున ఎన్.బీ.కే 107 నుంచి వచ్చే ఫస్ట్ హంట్ అదేనా..?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు మరో మాస్ యాక్షన్ తో రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ అవుతుంది.

NBK107: బాలకృష్ణ పుట్టినరోజున ఎన్.బీ.కే 107 నుంచి వచ్చే ఫస్ట్ హంట్ అదేనా..?
Nbk 107
Follow us

|

Updated on: Jun 08, 2022 | 9:01 AM

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు మరో మాస్ యాక్షన్ తో రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ అవుతుంది. NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ హంట్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటను కూడా చేశారు చిత్రయూనిట్. “NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్” అని బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్ హంట్ ని ప్రకటించింది.

బాలకృష్ణ పుట్టిన రోజు కానుక గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే బాలయ్య పుట్టిన రోజున టీజర్ విడుదల చేయనున్నారని కొందరంటుంటే మరి కొందరు మాత్రం.. టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ దాదాపు ఖరారు అయ్యిందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తుండగా.. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..