Nandamuri Balakrishna: అఖండంగా థియేటర్స్ లో గర్జించడానికి సిద్ధమయ్యారు నటసింహం నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమాకోసం బాలయ్య అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరవాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత నట సింహంతో సినిమా చేయాలని సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి ట్రై చేస్తున్నాడు. ఈ మేరకు బాలయ్యకు స్టోరీ లైన్ కూడా వినిపించాడని తెలుస్తుంది. లైన్ నచ్చి బాలయ్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట.. ఈ సినిమా షూటింగ్ జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. ఈ లోగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ షూటింగును పూర్తిచేసేసి, బాలకృష్ణ కోసం స్క్రిప్ట్ ను సెట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని సినిమాను ఈలోగానే పూర్తిన్ చేయనున్నారు. మరి అనీల్ బాలయ్య కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :