Akhanda: ప్రస్తుతం థియేటర్స్ లో అంఖండ జాతర జరుగుతుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. బోయపాటి శ్రీను , బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. గతంలో వచ్చిన సింహ , లెజెండ్ సినిమాలను ఈ సినిమా బీట్ చేసింది. టాక్ పరంగా, వసూళ్ల పరంగా అఖండ దూసుకుపోతుంది. రోజులు గడుతున్నా.. అన్ స్టాపబుల్ అంటూ థియేటర్ల దుమ్ము దులుపుతుంది ఈ సినిమా. ఇక బాలయ్య నట విశ్వరూపం చూపించారు. నందమూరి అభిమానుల పల్స్ తెలిసిన బోయపాటి ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తపాత్రలో చూపించడంతో అఖండ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమన్ మ్యూజిక్.. బాలయ్య మ్యాజిక్‌తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవ్వనుందని తెలుస్తుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ కు వెళ్లడం కొత్తేమీకాదు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, జెర్సీ సినిమాలు రీసెంట్ గా రీమేక్ అయ్యాయి. ఇక త్వరలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా రీమేక్ అవుతుంది. ఈ నేపథ్యంలో అఖండ సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ కు రెడీ అవుతుందని తెలుస్తుంది. అఖండ రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు అక్కడి భారీ నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇక అఖండ రీమేక్ లో అజయ్ దేవగన్ కానీ.. అక్షయ్ కుమార్ కానీ నటించే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే అజయ్ దేవగన్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే అక్షయ్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మరి అఖండ హిందీ రీమేక్ లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :