Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇక ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముచ్చటగా మూడోసారి కూడా పవర్ ఫుల్ కథతో బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ అందించి నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు బోయపాటి. ఇక అఖండ సినిమా విడుదలైన అని ఏరియాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా విజయవంతంగా థియేట్ర్స్ లో రన్ అవుతుంది. ఇదిలా ఉంటే కరోనా తర్వాత విడుదలైన పెద్ద సినిమా కావడంతో రికార్డు స్థాయిలో సినిమాకు ఓపినింగ్స్ లభించాయి. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందీ సినిమా. కరోనాతో నష్టాల్లో ఉన్న థియేటర్లు, ప్రొడ్యూసర్లకు ఈ సినిమా ఒక్కసారిగా కొత్త ఊపు తెచ్చింది. ఇక అఖండ త్వరలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. బోయపాటి తన స్టైల్ లో కెమెరా ,యాక్షన్ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైలర్ మొత్తం సినిమాలోని ఫైట్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ చూపించారు. బాలకృష్ణ రెండు గెటప్స్ ను ఈ ట్రైలర్ లో చూపించారు. అలాగే విలన్ గా నటించిన శ్రీకాంత్ బాలయ్య డైలాగులతో అఖండ న్యూ ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. పూర్ణ కీలక పాత్రలో నటించింది. అలాగే తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలించింది. ఈ కొత్త ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :