Mahesh Babu: మహేష్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన నమ్రత.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీ ఆగస్ట్ నెలలో పట్టాలెక్కనుంది.

Mahesh Babu: మహేష్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన నమ్రత.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Mahesh

Updated on: Jul 31, 2022 | 5:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిన విషయమే. షూటింగ్ నుంచి కాస్త విరామం లభించినా కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ విజయం అనంతరం.. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ వెళ్లోచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మహేష్ తీసుకున్న ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా స్విట్జర్లాండ్‏లో తీసుకున్న ఓ స్పెషల్ ఫోటోను ఆయన సతీమణి ఇన్ స్టాలో షేర్ చేశారు. సెయింట్ మోరిట్జ్ ఇట్ ఈజ్.. మీతో ఎవరిని పోల్చలేను అంటూ మహేష్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేష్, నమ్రత పిక్స్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. క్యూట్ కపూల్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీ ఆగస్ట్ నెలలో పట్టాలెక్కనుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్స్ చిత్రాలు వచ్చాయి. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీనే కాకుండా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ ఓ సినిమా చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us