Mahesh Babu : ‘నిన్ను ఎంతో మిస్సవుతున్నా’.. ఎమోషనల్ అయిన మహేష్ బాబు సతీమణి
ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు మహేష్ బాబు. గుంటూరు కారం సినిమా పూర్తవ్వడంతో పాటు ఇప్పుడు జక్కన్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు మహేష్. తాజాగా మహేష్ బాబు ఒక్కడే విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఓ బాడీ ఫిట్ నెస్ డాక్టర్ ను కలవడానికి వెళ్ళాడు మహేష్. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో మహేష్ బాబు తన యాటిట్యూడ్ తో.. నటనతో మాస్ లుక్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు మహేష్ బాబు. గుంటూరు కారం సినిమా పూర్తవ్వడంతో పాటు ఇప్పుడు జక్కన్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు మహేష్. తాజాగా మహేష్ బాబు ఒక్కడే విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఓ బాడీ ఫిట్ నెస్ డాక్టర్ ను కలవడానికి వెళ్ళాడు మహేష్. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు.
తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు. డాక్టర్ హ్యారీ కొనిగ్ తో కలిసి మహేష్ బాబు ట్రెక్కింగ్ కు వెళ్లిన ఫోటోలను షేర్ చేశారు. మహేష్ తన డాక్టర్ తో కలిసి జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో గట్టకట్టే చలిలో ట్రెక్కింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు మహేష్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోల పై ఆయన సతీమణి నమ్రత ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా అంటూ లవ్ ఎమోజీలు షేర్ చేశారు నమ్రత. ఇక రాజమౌళి సినిమా కోసం ఇప్పటికే స్టోరీ రెడీ అయిపోయిందని తెలిపారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మహేష్ జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే రాజమౌళి సినిమా కోసమే ఇలా కష్టపడుతున్నారని గుసగుసలు వినిపించాయి.
మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ..
View this post on Instagram
నమ్రత శిరోద్కర్ ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి