Konda Surekha-Nagarjuna: కొండా సురేఖ క్షమాపణలు.. అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయానికి సంబంధించి గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా కేసు వేశారు. అయితే తాజాగా ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణలు చెప్పారు.

Konda Surekha-Nagarjuna: కొండా సురేఖ క్షమాపణలు.. అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం
Konda Surekha, Nagarjuna

Updated on: Nov 13, 2025 | 6:47 PM

మంత్రి  కొండా సురేఖపై టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి క్షమాపణలు చెప్పడంతో నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. నాగార్జున ఫ్యామిలీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు మంత్రి సురేఖ బుధవారం (నవంబర్ 13) రాత్రి ఒక పోస్ట్ పెట్టారు.  ‘నాగార్జునను కానీ, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బందిపెట్టాలని కాని, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కాని నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’అని ట్వీట్ లో రాసుకొచ్చారు సురేఖ. ఈ క్రమంలోనే మంత్రిపై దాఖలు చేసిన పరువునష్టం కేసును ఉప సంహరించుకుంటున్నట్టు నాగార్జున తెలిపారు. మొత్తానికి ఈ నిర్ణయంతో  సురేఖ – అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.

కాగా కొన్ని నెలల క్రితం మంత్రి సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను విమర్శించే సమయంలో  నాగచైతన్య – సమంత విడాకులను ప్రస్తావించారు. కేటీఆర్ వల్లే వారు విడాకులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సినిమా ఇండస్ట్రీలోనూ మంత్రి వ్యాఖ్యలు తీవ్ర కలలకం  రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు మంత్రి బహిరంగ క్షమపణ చెప్పడంతో కేసును ఉపసంహరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

 

Nagarjuna withdraws defamation case against Konda Surekh

 

కొండా సురేఖ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి